హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

డిసెంబర్ 31 తర్వాత భయంకరంగా ఉంటుంది: కెసిఆర్

By Pratap
|
Google Oneindia TeluguNews

K Chandrasekhar Rao
హైదరాబాద్: ఈ ఏడాది డిసెంబర్ 31వ తేదీ తర్వాత తెలంగాణలో పరిస్థితి భయంకరంగా ఉంటుందని తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అధ్యక్షుడు కె. చంద్రశేఖర రావు హెచ్చరించారు. శ్రీకృష్ణ కమిటీ నివేదిక తెంలగాణకు వ్యతిరేకంగా వస్తే, కేంద్రం తెలంగాణ రాష్ట్రం ఇవ్వకపోతే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని, పరిస్థితి భయంకరంగా మారుతుందని ఆయన అన్నారు. మహబూబ్ నగర్ జిల్లాకు చెందిన కొంత మంది నాయకులు పార్టీలో చేరిన సందర్భంగా ఆయన బుధవారం వారిని ఉద్దేశించి మాట్లాడారు. తెలంగాణ బిడ్డల ఆత్మహత్యలు ఆగాలనే ఉద్దేశంతో ఉద్యమానికి తాత్కాలికంగా బ్రేకులు వేశామని ఆయన చెప్పారు. తెలంగాణ సాధించే వరకు పోరాడుతామని, తమది ధర్మబద్దమైన, న్యాయమైన పోరాటమని ఆయన అన్నారు.

ఉప ఎన్నికల్లో కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు పోటీ చేస్తాయని తాము భయపడడం లేదని, తెలంగాణ ప్రజలు ఆ పార్టీలకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని ఆయన అన్నారు. రాజీనామాలు చేసినవారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవాలని తెలంగాణ జెఎసిలో నిర్ణయం తీసుకున్నాం కాబట్టి పోటీ చేయవద్దని ఇంత కాలం కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలను కోరుతూ వచ్చామని, ఆలా కోరడం మర్యాదను పాటించడమేనని, భయపడి వారిని ఆ విజ్ఢప్తి చేయడం లేదని ఆయన అన్నారు. తెలంగాణ కోసం రాజీనామాలు చేస్తామని తెరాస వారి కన్నా ఎక్కువ గొంతు పెట్టుకుని తెలంగాణ కాంగ్రెసు, తెలుగుదేశం నాయకులు చెప్పారని, ఆ తర్వాత వెనక్కి తగ్గారని, ఊసరవెల్లుల కన్నా ఎక్కువగా రంగులు మారుస్తున్నారని ఆయన అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X