హైదరాబాద్: నగరంలోని కూకట్‌పల్లి రాఘవేంద్రసొసైటీలో ఒకటిన్నర నెలల పసికందును ముగ్గురు దుండగులు హత్య చేయడం తీవ్ర సంచలనం సృష్టించింది. ఇంట్లోకి చొరబడిన ముగ్గురు తల్లిని కట్టివేసి పసికందును హత్య చేసి పారిపోయారు. తరువాత ఇంట్లోకి వచ్చిన గృహయజమాని ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.
పాప హత్యను చేసిన దుండగులు అక్కడే ఉన్న పెద్ద పాపకు హానిచేయకుండా వెళ్లిపోయారని పాప తల్లి వెల్లడించింది. సంఘటన సమయంలో తండ్రి లేకపోవడం కూడా అనుమానాలకు దారి తీస్తోంది.