వైయస్ రాజశేఖర రెడ్డి దేవుడు, నేను రాక్షుడ్నా: సిఎం రోశయ్య

వాస్తవాలను, ఫీజులు ఇవ్వడంలో ఉన్న ఇబ్బందులను నా దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదు? 2008 నుంచి బకాయిలను తర్వాతి సంవత్సరంలో చెల్లిస్తున్నాం. అయినా నేను సీఎం అయ్యాకే ఆగిపోయాయన్నట్లుగా, పేదల వ్యతిరేకిగా ప్రచారం జరుగుతున్నా, మీరెందుకు వాస్తవాలను ప్రజలకు చెప్పట్లేదని ఆయన అడిగారు. ఫీజులను చెల్లించడంలో ఉన్న ఇబ్బందులను నా దృష్టికి ఎందుకు తీసుకురావడం లేదని ప్రశ్నించారు. అవసరానికి తగినంత బడ్జెట్ లేదని ఓ మంత్రి చెప్పగా, "ఆ విషయాన్ని నా దృష్టికి ఎందుకు తేలేదు? ఇది ఎవరి తప్పు" అని గట్టిగా ప్రశ్నించారు. "ఏదైనా ఇబ్బంది ఉంటే నా దృష్టికి తీసుకురండి, చర్చించి పరిష్కరిస్తానని చెప్పారు. అందరూ కలిసి నన్ను బీసీ వ్యతిరేకిని చేశారు కదా అంటూ సమావేశ ఆరంభంలోనే సీఎం మధనపడ్డారు. "నేను బీసీ వ్యతిరేకినంటూ ఆర్.కృష్ణయ్య, మరికొందరు మాట్లాడుతుంటే మీరు(మంత్రులు) నిజాలు ఎందుకు చెప్పలేదు? ఇంత రాద్ధాంతం జరుగుతుంటే ప్రభుత్వం తరఫున మీలో ఎవరైనా మాట్లాడారా? నిజాలేంటో ప్రజలకు చెప్పండి" అని మంత్రులను కోరారు.












Click it and Unblock the Notifications