హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

తెలంగాణ ఉప ఎన్నికల షెడ్యూల్ విడుదల

By Pratap
|
Google Oneindia TeluguNews

Telangana
హైదరాబాద్: తెలంగాణలోని పది శాసనసభా స్థానాల ఉప ఎన్నికలకు షెడ్యూల్ విడుదలైంది. వచ్చే నెల 27వ తేదీన పోలింగ్ జరగనుంది. తెలంగాణ బరిలో నిలిచి గెలిచేదెవరో 30వ తేదీన ఓట్ల లెక్కింపు జరుగుతుంది. అయితే, సిరిసిల్ల, వేములవాడ శాసనసభా స్థానాలకు మాత్రం ఎన్నికలు నిర్వహించడం లేదు. ఈ రెండు నియోజకవర్గాలు మినహా మిగిలిన పదిచోట్ల ఎన్నికల నిర్వహణకు ఎలక్షన్ కమిషన్ సోమవారం షెడ్యూలు విడుదల చేసింది. ఆ వెంటనే ఐదు జిల్లాల్లో ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలులోకి వచ్చింది.

ఉప ఎన్నికల ప్రకటన విడుదల కావడంతో ఈనెల 24న కరీంనగర్, వరంగల్ జిల్లాల్లో జరగాల్సిన ముఖ్యమంత్రి రోశయ్య పర్యటన రద్దయింది. షెడ్యూల్ నుంచి సిరిసిల్ల, వేములవాడ నియోజకవర్గాలను మినహాయించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర‌రావు ఆరోపించారు. దీనిని కోర్టులో సవాల్ చేస్తామని ఆయన ప్రకటించారు. షెడ్యూలు విడుదలతో ప్రధాన రాజకీయ పార్టీలు తమ సమర సన్నాహాలను ముమ్మరం చేశాయి. ఇప్పటికే అంతర్గతంగా తమ శ్రేణులను ఈ ఎన్నికలకు సన్నద్ధం చేయడంలో నిమగ్నమై ఉన్న టీఆర్ఎస్, కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీలు ఇకపై అభ్యర్థుల ఖరారు, ప్రచార వ్యూహం, వనరుల సమీకరణ వంటి అంశాలపై దృష్టి పెట్టాయి.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X