ఏడు కోట్ల వ్యవహారం నాకు సంబంధించింది కాదు: బాబు

అణు, ధర్మల్ విద్యుత్కేంద్రాలను శ్రీకాకుళం జిల్లాలో కేంద్రీకృతం చేయడం మంచిది కాదని ఆయన అన్నారు. తోటపల్లి రిజర్వాయర్ ను రైతుల కోసం నిర్మించడం లేదని, నాయకుల కోసం నిర్మిస్తున్నారని ఆయన ఆరోపించారు. తోటపల్లి రిజర్వాయర్ కు ప్రభుత్వం నిధులు కేటాయించడం లేదని ఆయన అన్నారు. విజయనగరం జిల్లాలో బెల్టు షాపులతో ప్రజలను దోచుకుంటున్నారని ఆయన ఆరోపించారు. సాగునీటి ప్రాజెక్టులపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఆయన అన్నారు. జలయజ్ఞం పథకాన్ని పేదల కోసం కాకుండా నాయకుల కోసం చేపట్టారని ఆయన వ్యాఖ్యానించారు. బాక్సైట్ తవ్వకాలు గిరిజనుల ఆమోదంతోనే జరగాలని ఆయన అభిప్రాయపడ్డారు.
సంక్షేమ పథకాల అమలులో వివక్ష తగదని ఆయన ప్రభుత్వానికి సూచించారు. తెలంగాణ విషయంలో తాము స్పష్టంగా ఉన్నామని ఆయన చెప్పారు. ప్రజాభిప్రాయం మేరకు ఇరు ప్రాంతాల నాయకులు ప్రతిస్పందిస్తున్నారని ఆయన అన్నారు. తెలంగాణ సమస్యను పరిష్కరించాల్సింది కాంగ్రెసు పార్టీయేనని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications