చిత్తూరు: చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం బొమ్మాయిపల్లె వద్ద గురువారం మధ్యాహ్నం కర్ణాటకకు చెందిన ఓ పెళ్లి బస్సు ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించబోయి బోల్తాపడింది. కాణిపాకం నుంచి బెంగళూరు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 26మంది గాయపడ్డారు. వారిలో ఆరుగురి పరిస్థితి విషమంగా ఉంది. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.
రాష్ట్రంలో రోజూ ఏదో ఒక మూల ప్రమాదాలతో రోడ్లు నెత్తురోడుతున్నాయి. రోడ్డు ప్రయాణం సురక్షితం కాదని జనం భావిస్తున్నారు. దీనితో రైలు రిజర్వేషన్లు, రైలు ప్రయాణాలు ఎక్కువవుతున్నాయి.