ఒంగోలు: ప్రకాశంజిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. రాచర్ల మండలం, పలుపూటిపల్లెవద్ద వేగంగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. సంఘటనా ప్రదేశానికి చేరుకున్న పోలీసులు మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. రాష్ట్రంలో ఇటీవల కాలంలో రోడ్ల్లు ప్రమాదాలతో నెత్తురోడుతున్నాయి. రోజుకి కనీసం రెండు పెద్ద రోడ్డు ప్రమాదాలు సంభవిస్తున్నాయి.