హైదరాబాద్: సైనా నెహ్వాల్ ను అభినందించిన తోలి రాజకీయ నాయకుడుగా చిరంజీవి వార్తల్లోకి వచ్చారు. పది రోజుల్లోనే మూడు టైటిళ్లు నెగ్గి హ్యాట్రిక్ సాధించిన సైనా నెహ్వాల్‌కు ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి అభినందనలు తెలిపారు. హైదరాబాద్‌కు చెందిన సైనా ఇండోనేషియా ఓపెన్ టోర్నమెంట్‌ని గెలుపొందడం రాష్ట్రానికి గర్వకారణమని చిరంజీవి అన్నారు.
ఈ మేరకు ఆయన ఓ ప్రకటనను విడుదల చేశారు. భవిష్యత్తులో ఆమె ప్రపంచ విజేత కావాలని ఆకాంక్షించారు. సైనా విజయం భారతీయులకు స్ఫూర్తిదాయకమన్నారు.