నెల్లూరు: గూడూరులోని పొట్టిశ్రీరాములు పార్కు వద్ద ఒక వివాహిత ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. మంటలకు తాళలేక ఆ యువతి కేకలు పెట్టింది. ఆమె శరీరం నుంచి మంటలు ఇంటికి అంటుకొని, ఆ మంటలు వ్యాపించి ఆరు పూరిళ్ల్లు దగ్ధమైయ్యాయి. ఆమె ఆత్మహత్యకు కారణాలు తెలియడం లేదు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.