తిరుపతి వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రేపు ముఖ్యమంత్రి రోశయ్య తిరుపతి పర్యటన

By Santaram
|
Google Oneindia TeluguNews

Rosaiah
తిరుపతి: ముఖ్యమంత్రి కె.రోశయ్య సోమవారం తిరుపతికి రానున్నారు. మధ్యాహ్నం 12.45 గంటలకు హైదరాబాద్ నుంచి విమానంలో బయలుదేరి 1.40 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకుంటారు. అధికార, అనధికారులను కలుసుకుంటారు. విమానాశ్రయ వీఐపీ లాంజ్‌లో కొద్దిసేపు విశ్రాంతి తీసుకొంటారు.

3 గంటల నుంచి అరగంట పాటు అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ శుంకుస్థాపన, బహిరంగ సభ నిర్వహించే స్థల వేదికను పరిశీలిస్తారు. మధ్యాహ్నం 3.30 గంటలకు రేణిగుంట విమానాశ్రయం నుంచి హెలికాప్టర్‌లో బయలుదేరి ఎన్‌ టీపీసీ, బీహెచ్ ఈఎల్ ప్రాజెక్టు ఏర్పాటవుతున్న మన్నవరం చేరుకొని అక్కడ ఏర్పాట్లను పరిశీలిస్తారు. సాయంత్రం 4.25 గంటలకు అక్కడి నుంచి హెలికాప్టర్ ‌లోనే బయలుదేరి 4.45 గంటలకు తారకరామ స్టేడియం హెలిప్యాడ్ చేరుకొని తిరుపతి పద్మావతి అతిథిగృహం చేరుకుంటారు.

సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు గంటసేపు ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులతో సమావేశమవుతారు. సాయంత్రం 6 గంటలకు తిరుపతి నుంచి తిరుమలకు కారులో వెళ్తారు. మార్గమధ్యంలో అలిపిరి వద్ద టీటీడీ నిర్మించిన స్విష్ట భవనాన్ని ప్రారంభిస్తారు. తిరుమల శ్రీ పద్మావతి అతిథి గృహంలో కొద్దిసేపు విశాంత్రి తీసుకుంటారు. రాత్రి 8 గంటలకు శ్రీవారిని దర్శించుకొని అక్కడే బస చేస్తారు. 29వతేదీ ఉదయం 7 గంటలకు కారులో బయలుదేరి 8 గంటలకు రేణిగుంట విమానాశ్రయం చేరుకొని 8.10 గంటలకు విమానంలో హైదరాబాద్‌ కు బయలుదేరి వెళ్లతారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X