ముద్దు ఇటలీ సోనియా వ్యాఖ్యలపై దుమారం

Gali Muddukrishnama Naidu
హైదరాబాద్: కాంగ్రెసు అధ్యక్షురాలు సోనియా గాంధీ, ముఖ్యమంత్రి కె. రోశయ్యపై తెలుగుదేశం నాయకుడు గాలి ముద్దు కృష్ణమనాయుడు చేసిన వ్యాఖ్యలపై దుమారం చెలరేగుతోంది. ఇటలీ సోనియా భారతీయుల రక్తం రుచి మరిగారని ఆయన ఆదివారం వ్యాఖ్యానించారు. అంతేకాకుండా దివంగత నేత వైయస్ కన్నా ప్రస్తుత ముఖ్యమంత్రి కె. రోశయ్య పెద్ద రాక్షసుడని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలు కాంగ్రెసు వర్గాల ఆగ్రహానికి కారణమయ్యాయి. ముఖ్యమంత్రి రోశయ్య కూడా తెలుగుదేశం నాయకుల వద్ద గాలి వ్యాఖ్యలపై మండిపడ్డారు.

గాలి ముద్దు కృష్ణమనాయుడు ఇంటి వద్ద కాంగ్రెస్‌ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. ఆందోళన చేస్తున్న కాంగ్రెస్‌ కార్యకర్తలు బంజారాహిల్స్‌లోని ముద్దు కృష్ణమనాయుడు ఇంటిలోకి వెళ్లేందుకు ప్రయత్నించడంతో పోలీసులు అడ్డుకున్నారు. ఆందోళనకారులను అరెస్టుచేసి జూబ్లీహిల్స్‌ పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. ముద్దుకృష్ణమ నాయుడు క్షమాపణ చెప్పే వరకు తమ ఆందోళన సాగుతుందని కాంగ్రెసు కార్యకర్తలు చెప్పారు.

కాగా, ముద్దు కృష్ణమనాయుడు వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి కె. రోశయ్య మండిపడ్డారు. బాబ్లీ ప్రాజెక్టును ఆపించాలని కోరేందుకు తన వద్దకు వచ్చిన ఎర్రబెల్లి దయాకర రావు తదితర తెలుగుదేశం నాయకుల వద్ద ఆయన తన ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ముద్దు కృష్ణమ నాయుడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ రాజకీయాల్లో ఆ వ్యాఖ్యలు దిగజారుడుతనానికి నిదర్శనమని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+