అనంతపురం: అనంతపురం జిల్లా గుంతకల్ మండలం అయ్యవారిపల్లె గ్రామంలోని చెరువులో ఇద్దరు వ్యక్తుల శవాలు తేలుతూ కనిపించాయి. రెండు వారాల క్రితం అదృశ్యమైన నీలకంఠరెడ్డి, మస్తాన్ లు శవాలై చెరువులో తేలినట్లు గుర్తించారు. వారిని కిడ్నాప్ చేసి హత్య చేసి ఉంటారని అనుమానించిన పోలీసులు దర్యాప్తు చేశారు.
ఈ జంట హత్యల కేసులో పోలీసులు బుధవారం ఏడుగురిని అరెస్టు చేశారు. భూవివాదం లేదా వివాహేతర సంబంధం ఈ హత్యలకు కారణమని భావిస్తున్నారు. అదుపులోకి తీసుకున్న ఏడుగురిని పోలీసులు విచారిస్తున్నారు.