సోనియా క్లాస్: వైయస్ జగన్ యాత్రపై లభించని హామీ

వచ్చే నెల 8న వై.ఎస్. జయంతి సందర్భంగా శ్రీకాకుళం జిల్లా నుంచి రెండో విడత ఓదార్పు యాత్రకు శ్రీకారం చుట్టాలన్న కృతనిశ్చయంతో ఉన్న జగన్ దానికి సోనియాను అనుమతి కోరినట్లు ఆయన సన్నిహితవర్గాలు తెలిపాయి. కడప ఎంపీ, ఆయన కుటుంబసభ్యులు చెప్పింది సావధానంగా విన్న సోనియా, యాత్రపై ఎటువంటి హామీ ఇవ్వలేదని తెలిసింది. విషయాన్ని పరిశీలిస్తానని అన్నట్లు సమాచారం. సాధారణంగా సోనియా ఎప్పుడూ నేరుగా నిర్ణయాలు ప్రకటించరు. చెప్పాల్సింది ఏమైనా ఉంటే తన ప్రతినిధుల ద్వారా వెల్లడిస్తుంటారు. జగన్ యాత్ర విషయంలోనూ అదే ఆనవాయితీని పాటిస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల 2న ముఖ్యమంత్రి రోశయ్య ఢిల్లీ పర్యటనకు వెళ్లనున్నారు. ఆ తర్వాతే జగన్ ఓదార్పు యాత్రపై నిర్ణయం వెలువడుతుందని ఆ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి.












Click it and Unblock the Notifications