వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు నో చాన్స్?

YS Jagan
న్యూఢిల్లీ: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు పార్టీ అధిష్టానం అనుమతి లభించే అవకాశాలు కనిపించడం లేదు. జగన్ కుటుంబ సభ్యులతో మంగళవారం సాయంత్రం మాట్లాడిన తీరు ఆ విషయాన్ని స్పష్టం చేస్తోందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. మంగళవారం జగన్ తల్లి విజయమ్మ, సోదరి షర్మిళలతో కలిసి సోనియాను కలిశారు. ఓదార్పు యాత్ర ఎందుకు తలపెట్టింది, దాన్ని ప్రాధాన్యం ఏమిటి, ఎందుకు దానికి అనుమతి ఇవ్వాలనే విషయంపై విజయలక్ష్మి, జగన్ సోనియాకు వివరించారు. వారు చెప్పేదంతా సోనియా విన్నారని, అయితే ఓదార్పు యాత్రకు అనుమతి ఇచ్చే విషయంపై మాట్లాడలేదని అంటున్నారు. అయితే, ఓదార్పు యాత్రను వాయిదా వేసుకోవాలని పరోక్షంగా సూచన చేశారని చెబుతున్నారు. చాలా భవిష్యత్తు ఉంది, ప్రస్తుతం నియోజకవర్గంలో పనిచేయాలని సోనియా జగన్ కు సలహా ఇచ్చినట్లు ఓ ప్రముఖ దినపత్రిక రాసింది.

సాక్షి దినపత్రికలో ఓదార్పు యాత్రకు అనుమతి ఇచ్చారా, లేదా అనే విషయాన్ని ప్రస్తావించకుండా వార్తాకథనాన్ని ప్రచురించారు. జగన్, విజయలక్ష్మి చెప్పిన మాటలు సోనియా సావధానంగా విన్నారని, భేటీ మర్యాదపూర్వకంగా జరిగిందని సాక్షి దినపత్రికలో రాశారు. దీన్ని బట్టి సోనియా ఓదార్పు యాత్రపై జగన్ కు ఏ విధమైన హామీ ఇవ్వలేదని స్పష్టంగానే తెలుస్తోంది. విజయలక్ష్మి రాసిన లేఖకు ప్రతిస్పందనగా మర్యాద కోసం మాత్రమే జగన్ కుటుంబ సభ్యులను సోనియా కలుసుకోవడానికి అనుమతిచ్చారని, ఓదార్పు యాత్రకు అనుమతిచ్చే విషయంపై చర్చలకు కాదని తెలుస్తోంది. విజయలక్ష్మి లేఖ రాసిన తర్వాత కూడా తాను కలుసుకోక పోతే పూర్తిగా నిర్లక్ష్యం చేసినట్లవుతుందని, దానిపై విమర్సలు రావచ్చునని, అలాంటి విమర్శలు రాకుండా చూసుకోవడానికి మాత్రమే సోనియా అపాయింట్ మెంటు ఇచ్చారని అంటున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+