లండన్: నోబెల్ పురస్కార గ్రహీత అమర్త్యసేన్‌ను బ్రిటన్ లోని 'క్వీన్స్ యూనివర్సిటీ బెల్ ఫాస్ట్' డాక్టరేట్ ఆఫ్ సైన్స్‌తో సత్కరించింది. అర్థశాస్త్రంలో అసాధారణ కృషికిగాను ఆయనకు దీనిని ప్రదానం చేసింది. ఆధునిక భారత గొప్ప మేధావులు, ఆర్థికవేత్తల్లో అమర్త్యసేన్ ఒకరని విశ్వవిద్యాలయం ఒక ప్రకటనలో ప్రశంసించింది.
పేదరికం నిర్మూలన విషయంలో అమర్త్యసేన్ విశిష్ట కృషి చేసి తన గ్రంధాల్లో అమూల్య విషయాలను రాశారు. ఆర్ధిక శాస్త్రంలో నోబెల్ బహిమతి సాధించిన తొలి భారతీయుడు అమర్త్యసేన్.