హైదరాబాద్: ఆల్వాల్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో గాయపడిన ఎస్.ఐ మృతి చెందారు. నాంపల్లి సీసీఎస్ ఎస్ ఐ కామేశ్వరరావు ఓ హోంగార్డు సరళతో కలిసి ఉంటున్నారు. ఆమె ఆత్మహత్యకు పాల్పడగా ఆమెను రక్షించబోయి ఎస్.ఐ కూడా గాయపడ్డారు. ఆసుపత్రిలో చేర్చి చికిత్స చేసినా తీవ్రంగా గాయపడినందున ఆయన ఈరోజు మృతి చెందారు. మృతురాలి తల్లి రుక్మిణికి 25 శాతం గాయాలయ్యాయి. అయితే హోంగార్డు మృతికి ఎస్ ఐ కారణమై ఉంటాడన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.