హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

గ్రామీణ వైద్యంపై ప్రభుత్వం నిర్లక్ష్యం: చంద్రబాబు నాయుడు

By Santaram
|
Google Oneindia TeluguNews

Chandrababu Naidu
హైదరాబాద్‌: రాష్ట్రంలో గ్రామీణ ప్రాంతాలు,ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులు విజృంభిస్తున్నాయని సౌకర్యాలు మాత్రం శూన్యంగా ఉన్నాయని తెలుగుదేశం అధ్యక్షుడు, ప్రతిపక్ష్ నేత చంద్రబాబు నాయుడు అన్నారు. శాసనసభలో ఈరోజు ఉదయం వైద్య, ఆరోగ్య రంగాలపై టీడీపీ ప్రశ్న లేవనెత్తింది. ప్రాథమిక ఆరోగ్యకేంద్రాల్లో పడకలు సరిగా లేవని, ఏజెన్సీ ప్రాంతాల్లో వ్యాధులు వస్తే మందులు ఇచ్చేవారు లేరని అన్నారు. ఏ సమాజంలోనైనా అభివృద్ధి సాధించాలంటే విద్య,వైద్య రంగాలు ఎంతో ముఖ్యమని అన్నారు. ఈ రంగాలపై సీఎం సమీక్షించి తగిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆసుపత్రులకు నిధులు లేవని ఇక అభివృద్ధి ఎలాఈ సాధ్యమని ప్రశ్నించారు. మంత్రి దానం నాగేందర్‌ సమాధానం ఇస్తూ తమ ప్రభుత్వం గ్రామీణ ఆరోగ్యంపై ఎంతో శ్రద్ధ చూపుతోందని అనవసరంగా రాజకీయం చేయటం సరికాదని అన్నారు. ప్రభుత్వ వైఖరికి నిరసనగా టీడీపీ సభ్యులు సభ నుంచి వాకౌట్‌ చేశారు.

వైద్యరంగంపై, ఏయే విషయాలకునిధులు ఎలా వ్యయం చేయాలనే విషయంపై ప్రభుత్వానికిసరైన అవగాహన లేదని లోక్‌సత్తా అధినేత జయప్రకాశ్‌నారాయణ అన్నారు. ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని తాను అనను కాని అవగాహన లేదన్నది మాత్రం సుస్పష్టమన్నారు. ఈ ఆధునిక కాలంలోకూడా టీకాలు వేస్తే నయం అయ్యే వ్యాధులకు కూడా ప్రజలు మరణిస్తున్నారని ఇది ఎంతో శోచనీయమని అన్నారు. ప్రభుత్వ తీరుకు తాను నిరసన తెలుపుతున్నానని అన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X