చంద్రబాబు నాయుడు సహా టిడిపి నేతలపై మహా పోలీసుల దౌర్జన్యం

ఎట్టి పరిస్థితిలోనూ తమ బాబ్లీ పోరాటం ఆగిపోదని శాసనసభ్యుడు నారాయణ రెడ్డి అన్నారు. పోలీసులు తమను బూట్లతో తన్నారని శాసనసభ్యుడు కొత్తకోట దయాకర్ రెడ్డి చెప్పారు. చంద్రబాబు పట్ల కూడా పోలీసులు అవమానకరంగా ప్రవర్తించారని ఆయన అన్నారు. తెలుగుదేశం ప్రతినిధులను బలవంతంగా బస్సుల్లో ఎక్కించి తరలించేందుకు పోలీసులు సిద్ధపడ్డారు. చంద్రబాబు సహా తెలుగుదేశం నాయకులను ఔరంగాబాద్ జైలుకు తరలిస్తున్నట్లు సమాచారం. తొలుత ఆంధ్రప్రదేశ్ లో వారిని వదిలేస్తారని భావించారు. అయితే, జ్యుడిషియల్ కస్టడీలో ఉండడంతో వారిని జైలుకు పంపించాలని నిర్ణయించినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications