తెలంగాణకు ఎసరు: చంద్రబాబుపై రాజ్ న్యూస్ అటాక్

చర్చల ద్వారా, సామరస్యపూర్వకంగా జలవివాదాలను పరిష్కరించుకోవడానికి బదులు రెండు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చు పెట్టి తెలంగాణకు తీరని అన్యాయం చేయడానికి చంద్రబాబు పూనుకున్నారనేది రాజ్ న్యూస్ ప్రధానమైన ఆరోపణ. మహారాష్ట్రతో జలవివాదం, బాబ్లీ వివాదం పరిష్కారానికి ఒక బోర్డును ఏర్పాటు చేయించడం సరైన మార్గమని తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ రాజ్ న్యూస్ ప్రతినిధితో అన్నారు. చంద్రబాబు వివాదాన్ని ఇరు రాష్ట్రాల ప్రజల మధ్య చిచ్చుపెట్టేందుకు వాడుకున్నారని ఆరోపించింది. మహారాష్ట్రలోని తెలుగు ప్రజలకు చంద్రబాబు వల్ల రక్షణ లేకుండా పోయిందని వ్యాఖ్యానించింది. మహారాష్ట్రకు బతకడానికి వెళ్లిన తెలంగాణ ప్రజలకు ఏమైనా జరిగితే అందుకు చంద్రబాబు బాధ్యత వహించాల్సి ఉంటుందని తెలంగాణవాదులు హెచ్చరిస్తున్నారు.












Click it and Unblock the Notifications