తమిళనాడులో ఫకీర్ చిన్నారిని నరికి, నెత్తురు తాగాడు

జి ఖాదర్ యూసుఫ్ అనే చిన్నారి బాలుడిని ఫకీర్ మదురైలోని గొరిపాలాయం దర్గా నుంచి జులై 2వ తేదీన కిడ్నాప్ చేశాడు. విధవరాలైన షెరీనా ఫాతిమా ఆ బాలుడితో దర్గాలోనే కాపురం ఉంటోంది. తన సహచరురాలు రమాలా బీవీకి చికిత్స అందించడానికి వెళ్లినప్పుడు ఫకీర్ ఆ బాలుడిని చూశాడు. గఫూర్, రమాలా బీవీ ఆ చిన్నారిని రామనాథపురంలోని లాడ్జికి తీసికెళ్లారు. చిన్నారి ఏడ్పు లంకించుకోవడంతో ఫకీర్ అతని గొంతు విరిచాడు. ఆ తర్వాత బాలుడిని నరికి తలను ఏర్వాడి దర్గా వద్ద కుట్టుపల్లివసల్ లో పూడ్చిపెట్టాడు. గఫూర్ ను పోలీసులు శుక్రవారం అరెస్టు చేసి మదురైకి తెచ్చారు. అతను చూపిన వివరాల ప్రకారం తవ్వకాలు జరిపి చిన్నారి శరీరావయవాలను పోలీసులు వెలికి తీశారు.












Click it and Unblock the Notifications