పశ్చిమ బెంగాల్లో ఆరుగురు నక్సల్స్ హతం: మృతుల్లో సిద్ధు సొరేన్

Maoists
పశ్చిమ మిడ్నాపూర్: పశ్చిమ బెంగాల్లోని పశ్చిమ మిడ్నాపూర్ జిల్లాలో జరిగిన ఎదురుకాల్పుల్లో ఆరుగురు నక్సలైట్లు, ఓ సిఆర్పీఎఫ్ జవాను మరణించారు. మరణించిన నక్సలైట్లలో ఓ మహిళ కూడా ఉంది. నక్సలైట్లకు, పారా మిలిటరీ బలగాలకు మధ్య రాత్రంతా ఎదురుకాల్పులు జరిగాయి. తమకు అందిన సమాచారం మేరకు నక్సల్నివ్యతిరేక బలగాలు గొలటోర్ పోలీసు స్టేషన్ పరిధిలోని దట్టమైన అటవీ ప్రాంతానికి వెళ్లారని, ఈ సమయంలో నక్సలైట్లకు, బలగాలకు మధ్య ఎదురు కాల్పులు జరిగాయని సిఆర్పీఎఫ్ వర్గాలు చెపపాయి.

సంఘటనా స్థలంలో సోమవారం ఉదయం ఆరు మృతదేహాలు కనిపించాయని చెప్పాయి. సంఘటనా స్థలం నుంచి 12 ఆయుధాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపాయి. ఎదురుకాల్పుల్లో మరణించిన సిఆర్పిఎఫ్ జవానును ఆశిష్ తివారీగా గుర్తించారు. మృతి చెందిన నక్సలైట్లలో టాప్ నక్సలైట్ కమాండర్ సిద్ధు సొరేన్ ఉన్నట్లు అనుమానిస్తున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+