దొడ్డిదారిన చాకలి శ్రీనివాస్ మృతదేహం నిజామాబాద్ కు తరలింపు

పోలీసు ఉన్నతాధికారి లడ్హాపై తెరాస నాయకుడు నాయని నర్సింహా రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీనివాస్ తల్లి, ఇతర కుటుంబ సభ్యులు ఆస్పత్రి వద్ద నిరీక్షిస్తున్నారని, వారికి కూడా తెలియకుండా పోలీసులు శ్రీనివాస్ మృతదేహాన్ని తరలించారని ఆయన మండిపడ్డారు. శ్రీనివాస్ చిన్నాయనతో మృతదేహాన్ని నిజామాబాద్ తరలించినట్లు పోలీసులు చెబుతుండడాన్ని ఆయన ఖండించారు. శ్రీనివాస్ మృతదేహానికి సిరికొండలో అంత్యక్రియలు జరుగుతాయి. ఈ అంత్యక్రియలకు తెరాస అధ్యక్షుడు కె చంద్రశేఖర రావు, తెలంగాణ జెఎసి కన్వీనర్ కోదండరామ్ హాజరవుతున్నారు.












Click it and Unblock the Notifications