ప్రత్యేక రాయలసీమ ఉద్యమానికి టిజి వెంకటేష్ స్వస్తి

తెరాస అధినేత చంద్రశేఖర్‌రావు సైతం రాయలసీమ వెనుకబడిందని చెప్పారన్నారు. కమిటీకి అన్నీ వివరించిన తరువాత తుది తీర్పునకు వేచి ఉండాలే గాని, శవరాజకీయాలు చేయడం తగదని హితవు పలికారు. కమిటీకి చిత్తశుద్ధి ఉంటే ప్రభుత్వానికి సలహా ఇచ్చి వాస్తవాలు తెలుసుకుని విచారణ చేపట్టాలన్నారు. ఆగస్టు 14వతేదీన గ్రేటర్ రాయలసీమ పరిధిలో బహిరంగ సభ ఏర్పాటుచేసి హక్కుల సాధనపై తదుపరి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు.
శ్రీకృష్ణ కమిటీ విచారణపై అనేక అనుమానాలున్నట్లు టీజీ చెప్పారు. ఆత్మహత్యలు, ఆందోళనలకు లొంగి తీర్పు ఇచ్చే పరిస్థితి కమిటీలో కనిపిస్తోందన్నారు. 119లో 12 సీట్లకు పదేపదే రాజీనామా చేసి గెలవడం ఇదే తెలంగాణ ప్రజాభిప్రాయం అని మభ్యపెట్టడం అన్యాయమని వ్యాఖ్యానించారు. గ్రేటర్ 'సీమ' పరిధిలోకి రాని జర్నలిస్టులను ఇక నుంచి ఈ ప్రాంతంలో పని చేయనీయమంటూ ఆయన చెప్పారు. పత్రికలే సగం ద్రోహం చేస్తున్నాయని ఆయన ఆరోపించారు. తమ ఆస్తులు, పత్రికలను కాపాడుకునేందుకు తెలంగాణ భజన చేస్తూ 'సీమ' హక్కులు కాలరాస్తున్నాయని ఆరోపించారు.












Click it and Unblock the Notifications