సిఎం రోశయ్య బాబ్లీపై ఉత్త చేతులతో వచ్చారు: చంద్రబాబు

బాబ్లీ విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వం అబద్ధాలు చెప్పిందని విమర్శించారు. తప్పు చేస్తున్నామని మహారాష్ట్రకు అర్థమైందని అన్నారు. బాబ్లీ ప్రాజెక్టు విషయంలో కేంద్ర ప్రభుత్వం మన రాష్ట్రానికి అన్యాయం చేస్తోందని ఆయన అన్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న బాబ్లీ ప్రాజెక్టు అక్రమమని చెబుతూ గత కేంద్ర జలవనరుల శాఖ మంత్రి సైఫుద్దీన్ సోజ్ మహారాష్ట్రకు రాసిన లేఖను చంద్రబాబు మీడియా ప్రతినిధుల సమావేశంలో విడుదల చేశారు. బాబ్లీకి వ్యతిరేకంగా తాము నిరంతర పోరాటం చేస్తామని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications