కేశవరావుకు చిత్తశుద్ధి ఉంటే తెరాసలో చేరాలి: గోనె ప్రకాష్ రావు

ఇటువంటి ఫలితాలు చూడలేదని కేశవరావు అన్న మాటల్లో నిజం లేదని, 1971లో తెలంగాణ ప్రజా సమితి (టిపిఎస్) విజయం ఇలాంటిదే అని ఆయన అన్నారు. కేశవరావు లాంటి సీనియర్ల వల్లనే తెలంగాణ ఉప ఎన్నికల్లో కాంగ్రెసు ఓడిపోయిందని ఆయన విమర్శించారు. గత రెండు ఉద్యమాల్లో సమైక్యవాదిగా ఉన్న కేశవరావుది పార్టీ మారిన చరిత్ర అని ఆయన వ్యాఖ్యానించారు. కాంగ్రెసు పార్టీతో తెలంగాణ సాధ్యం కాదని, యుపిఎ అంగీకరిస్తేనే తెలంగాణ వస్తుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications