కొండా సురేఖపై హైకమాండ్ క్రమశిక్షణా చర్య తప్పదా?

ముఖ్యమంత్రి శాసనసభ్యులకు టైం ఇవ్వడం లేదని ఆమె అన్నారు. నియోజకవర్గం సమస్యలను వినిపించడానికి వెళ్లిన శాసనసభ్యులను వ్యంగ్యాస్త్రాలతో బాధపెడుతున్నారని ఆమె విమర్శించారు. తెలంగాణ ఉప ఎన్నికల్లో పార్టీ ఓటమికి ముఖ్యమంత్రే బాధ్యత వహించాలని ఆమె అభిప్రాయపడ్డారు. ఓటమికి ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ రాజీనామా చేయాల్సిన అవసరం లేదని ఆమె అన్నారు. జిల్లా మంత్రులు, ఇంచార్జీ మంత్రులు ఓటమికి బాధ్యత వహించి రాజీనామా చేయాలని ఆమె అన్నారు.
ముఖ్యమంత్రిపై విమర్శలు చేసినందుకు ఇంతకు ముందు అంబటి రాంబాబును పార్టీ నుంచి అంబటి రాంబాబును హైకమాండ్ సస్పెండ్ చేసింది. ఇప్పుడు కొండా సురేఖకు అదే పరిస్థితి రావచ్చునని అంటున్నారు. కొండా సురేఖ మొదటి నుంచి పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వర్గంలో ప్రధాన నాయకురాలిగా ఉంటూ వస్తున్నారు. ఆమె కేవలం విమర్శలు చేయడమే కాకుండా ఆ విమర్శలతో లేఖ రాసి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీ, అహ్మద్ పటేల్, వీరప్ప మొయిలీకి ఫాక్స్ చేశారు. ఈ స్థితిలో కొండా సురేఖపై హైకమాండ్ చర్యలు తీసుకునే అవకాశాలే ఎక్కువగా ఉంటాయని భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications