జగన్ వెళ్లినా ప్రభుత్వానికీ, పార్టీకీ నష్టం లేదు: జెసి

ముఖ్యమంత్రి పదవి నుంచి రోశయ్యను మార్చే అవకాశమే లేదన్నారు. కాంగ్రెస్ అ«ధిష్ఠానం తరచూ ముఖ్యమంత్రులను మార్చే విధానానికి స్వస్తి చెప్పిందన్నారు. ముఖ్యమంత్రి రోశయ్య సీనియర్ నాయకులని, మాటల్లో కంటే చేతల్లో చూపించే తత్వమున్న వ్యక్తి అని కొనియాడారు. 'పీసీసీ అధ్యక్ష పదవికి మీపేరు పరిశీలనలో ఉన్నట్టు జరుగుతున్న ప్రచారంపై ఏమంటారు' అని ఒక విలేకరి ప్రశ్నించగా జేసీ స్పందిస్తూ తనకు అలాంటి ఆలోచన లేదన్నారు. పీసీసీ అధ్యక్షుడి ఎంపికకు ఇంకా సమయం ఉందని, ఎవరిని ఎంపిక చేయాలన్న దానిపై చర్చ జరగలేదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications