తెలంగాణ కోరడం దేశద్రోహమా: వెంకయ్య నాయుడు

Venkaiah Naidu
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును కోరడం దేశ ద్రోహమని సీమాంధ్ర మంత్రులు శ్రీకృష్ణ కమిటీకి చెప్పడంపై బిజెపి సీనియర్ నాయకుడు వెంకయ్య నాయుడు మండిపడ్డారు. రాష్ట్ర విభజన కోరటం దేశద్రోహం ఎలా అవుతుందని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ప్రశ్నించారు. సీమాంధ్ర మంత్రుల మాటలు ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నాయని ఆయన అన్నారు. తెలంగాణ కావాలంటున్న పిసిసి అధ్యక్షుడు డి. శ్రీనివాస్, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియను ప్రారంభిస్తామని చెప్పిన కేంద్ర హోం మంత్రి పి. చిదంబరం దేశద్రోహులవుతారా అని ఆయన అడిగారు. సీమాంధ్ర మంత్రులు బాధ్యతారహితమైన ప్రకటనలు చేస్తున్నారని ఆయన విమర్శించారు.

ఉప ఎన్నికల ఫలితాలు చూసైనా కాంగ్రెసుకు జ్ఞానోదయం కావాలని, లేకుంటే మరింతగా కాంగ్రెసు నష్టపోతుందని ఆయన అన్నారు. ఈ ఎన్నికల్లో అభ్యర్థుల విజయం సానుభూతితో కూడుకున్నదని అనడం సరి కాదని ఆయన అన్నారు. 2014 ఎన్నికల్లో కూడా డిఎస్ కు పరాభవం తప్పదని ఆయన అన్నారు. కామన్ వెల్త్ క్రీడల కుంభకోణంలో ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ పాత్ర ఉందని తేలితే పదవి నుంచి తొలగించాలని ఆయన డిమాండ్ చేశారు. ఈ అవినీతిపై పార్లమెంటరీ సంయుక్త కమిటీతో విచారణ జరిపించాలని ఆయన కోరారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+