సికింద్రాబాద్: బోనాల పండుగ సందర్భంగా కడప ఎంపీ వైయస్ జగన్ సికింద్రాబాద్ పికెట్ ప్రాంతంలో నల్లపోచమ్మ అమ్మవారిని దర్శించుకున్నారు. ఆదివారం మధ్యాహ్నం ఇక్కడికి చేరుకున్నవైఎస్ తనయుడికి ఆలయ కమిటీ సభ్యులు, స్థానిక నేతలు సాదర స్వాగతం పలికారు. సికింద్రాబాద్ ఎమ్మెల్యే జయసుధతో కలిసి ఆయన అమ్మవారిని దర్శించుకున్నారు.
మరోవైపు జగన్ వస్తున్నారన్న విషయం తెలియగానే అభిమానులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఇక్కడికి తరలివచ్చారు. ఆయనను చూసేందుకు పోటీపడ్డారు.