వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వైయస్ జగన్ తో రాజీకి సందీప్ దీక్షిత్ మధ్యవర్తిత్వం కట్టుకథేనా?

By Pratap
|
Google Oneindia TeluguNews

Sandeep Dikshit
న్యూఢిల్లీ: పార్టీ అధిష్టానంతో జగన్ కు సంధి కుదర్చడానికి పార్లమెంటు సభ్యుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి తనయుడు సందీప్ దీక్షిత్ మధ్యవర్తిత్వం నెరుపుతున్నట్లు వచ్చిన వార్తాకథనాలు కట్టుకథలేనా అనే అనుమానం కలుగుతోంది. అయోమయం సృష్టించడానికి, తన ఇమేజ్ ను పెంచుకోవడానికి జగన్ వర్గం ఈ తప్పుడు ప్రచారానికి దిగిందనే మాట కూడా వినిపిస్తోంది. అయితే సందీప్ దీక్షిత్, వైయస్ జగన్ కలిసి మాట్లాడుకున్న విషయం మాత్రం నిజం. కానీ తాము ఏ విధమైన రాజకీయాలూ చర్చించలేదని సందీప్ దీక్షిత్ తో పాటు వైయస్ జగన్ కూడా మీడియా ప్రతినిధులతో చెప్పారు. ఒక సహచర ఎంపిగా మాత్రమే తాను సందీప్ దీక్షిత్ మాట్లాడానని జగన్ చెప్పారు.

కాగా, ఆంధ్రప్రదేశ్‌ రాజకీయాల్లో తనకు ఏ పాత్రా లేదని కాంగ్రెసు పార్టీ సందీప్‌ దీక్షిత్‌ పేర్కొన్నారు. పార్టీ డిప్యూటీ చీఫ్‌ విప్‌ హాదాలో ఎంపీలను సమన్వయపరచడం తన బాధ్యతని, ఈ విషయమై పార్టీ ఎంపీలందరితో మాట్లాడుతుంటానని తెలిపారు. అదే క్రమంలో కడప ఎంపీ వైఎస్‌ జగన్మోహన్‌ రెడ్డిని కూడా కలిసి మాట్లాడానని చెప్పారు. అధిష్ఠానం-జగన్‌ మధ్య సయోధ్య కుదర్చడానికి తాను ప్రయత్నిస్తున్నట్లు వచ్చిన వార్తలను ఆయన మంగళవారం సాయంత్రం ఖండించారు. తాను రాయబారం నడపట్లేదని, అలాంటి బాధ్యతలేవీ కూడా తనకు అప్పగించలేదని ఆయన మీడియా ప్రతినిధులతో అన్నారు.

జగన్‌కు ఏమైనా చెప్పదలచుకున్నారా అని అడిగినప్పుడు - ఆయనే కాదు, ఏ కాంగ్రెసు కార్యకర్త అయినా పార్టీ పట్ల విశ్వాసంగా ఉండాలన్నదే తన అభిప్రాయమన్నారు. పార్టీ అమ్మలాంటిదని వ్యాఖ్యానించారు. ఆంధ్రా రాజకీయాల్లో జగన్‌ ప్రస్తుతం ఒక చర్చనీయాంశం కాబట్టి ఆయనతో తాను రాజకీయాలు మాట్లాడానని అనుకొని ఉండొచ్చని అభిప్రాయపడ్డారు. కానీ తాను జోక్యం చేసుకోవడానికీ ఏమీ లేదన్నారు. పార్లమెంటు సెంట్రల్‌హాల్‌లో పిచ్చాపాటీగా మాట్లాడుకొనే మాటలకు అంత ప్రాధాన్యం ఇవ్వాల్సిన అవసరంలేదన్నారు.

న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X