బాబు భార్య భువనేశ్వరికి కూడా ప్లాట్ ఉంది: అంబటి రాంబాబు
State
oi-Pratapreddy
By Pratap
రాజమండ్రి: ఎపిఐఐసి, ఎమ్మార్ ప్రాపర్టీస్ లో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు సతీమణి భువనేశ్వరికి కూడా ప్లాట్ ఉందని ఎపిఐఐసి మాజీ చైర్మన్, కాంగ్రెసు బహిష్కృత నేత అంబటి రాంబాబు అన్నారు. చాలా మంది ప్రముఖులకు వాటిలో ప్లాట్లు ఉన్నాయని ఆయన శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో చెప్పారు. ప్లాట్లు ఉన్నవారంతా అవినీతికి పాల్పడినట్లేనా అని ఆయన అడిగారు.
సెప్టెంబర్ 2వ తేదీన తిరుపతిలో వైయస్ రాజశేఖర రెడ్డి సంస్మరమ సభ ఘనంగా జరుగుతుందని ఆయన చెప్పారు. ఈ సభకు ఏర్పాట్లు జరుగుతున్నట్లు ఆయన తెలిపారు.