వైయస్ జగన్ తీరుపై సందీప్ దీక్షిత్ విసిగిపోయారా?

Sandeep Dikshit
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ తీరు పట్ల కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు, ఢిల్లీ ముఖ్యమంత్రి షీలా దీక్షిత్ తనయుడు సందీప్ దీక్షిత్ విసిగిపోయినట్లే ఉన్నారు. జగన్ కు అధిష్టానంతో సయోధ్య కుదిర్చేందుకు ఆయన ఇటీవల ప్రయత్నాలు చేశారు. జగన్ తన పట్టు వీడకపోవడంతో సందీప్ వెనక్కి తగ్గారు. పైగా, సందీప్ దీక్షిత్ కు జగన్ తీరు నచ్చనట్లు తెలుస్తోంది. ఆయన మాటలే అందుకు సాక్ష్యమిస్తున్నాయి. ఓదార్పుపై పార్టీ అధ్యక్షురాలు సోనియా చెప్పిన విషయాలను జగన్ బహిరంగ పరచడం తప్పేనని ఆయన అన్నారు. ఓదార్పు యాత్రను రాజకీయ ప్రదర్శనలా భారీఎత్తున నిర్వహించడం కూడా సరైంది కాదని ఆయన చెప్పారు.

జగన్ సమస్యలేమిటో ఆయనతో తొలి సమావేశంలో తెలుసుకున్నానని, మళ్లీ ఒకటి రెండురోజుల్లో ఆయనను కలుసుకుంటానని దీక్షిత్ తెలిపారు. సీనియర్ నేతలతో కూడా ఆయన మాట్లాడవచ్చని సూచనప్రాయంగా వెల్లడించారు. సోనియా పార్టీ కోసం ఎన్నో త్యాగాలు చేశారని, దాదాపు క్షీణ దశలో ఉన్న కాంగ్రెస్ ఈ స్థాయికి వచ్చిందంటే ఆమె చలవేనని దీక్షిత్ అన్నారు. సందీప్ దీక్షిత్ సయోధ్య యత్నాలపైనే సోనియా వీరప్ప మొయిలీపై కస్సుబుస్సుమన్నట్లు వార్తలు వచ్చాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+