కె చంద్రశేఖర రావును ఆకాశానికెత్తిన బొత్స సత్యనారాయణ

హితబోధ చేస్తున్నానని అనుకోవద్దని, తాను చొరవ చూపుతున్నందుకు క్షమించాలని కోరారు. మంత్రులను ఉద్దేశించి మాత్రమే విజ్ఞప్తి చేయడం లేదని ప్రజాప్రతినిధులు, ప్రజాప్రతినిధులుకాని వారిని సైతం సంయమనం పాటించాల్సిందిగా కోరుతున్నట్లు చెప్పారు. పరుష పదజాలానికి అందరూ దూరంగా ఉండాలని, ఎవరు ముందు అన్నారు ఎవరు తరువాత అన్నారు అనేది ముఖ్యం కాదని చెప్పారు. కోర్టు వరకు వెళ్లడం మంచి సంప్రదాయం కాదన్నారు. శ్రీకృష్ణ కమిటీపై అన్ని పార్టీల్లోనూ విశ్వసనీయత నెలకొందన్నారు. కమిటీ నివేదికను అనుసరించి కేంద్రం రాష్ట్రవిభజనకు నిర్ణయించినా, సమ్యైక్యాంధ్రకే కట్టుబడినా ఆ నిర్ణయాన్ని అందరం పాటిద్దామన్నారు. సమ్యైక్యాంధ్ర కోసం కూడా కొంతమంది శాసనసభ్యులు రాజీనామాలు చేశారన్నారు. మంత్రుల్లో ప్రాంతీయ విభజన వచ్చిందా అన్న ప్రశ్నకు అలాంటిదేమీ లేదని తాము రాష్ట్రానికి మంత్రులమని ఆయన అన్నారు. ఒక ప్రాంతానికి చెందిన మంత్రులు మరో ప్రాంతానికి వెళ్లటం లేదన్నది వాస్తవం కాదన్నారు.












Click it and Unblock the Notifications