వైయస్ జగన్ పై పిఆర్పీ అధ్యక్షుడు చిరంజీవి పరోక్ష విమర్శ

Chiranjeevi
తిరుపతి: కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై ప్రజారాజ్యం పార్టీ అధ్యక్షుడు చిరంజీవి పరోక్ష విమర్శలు చేశారు. ఉన్న ఫళంగా ముఖ్యమంత్రి అయిపోదామనుకుంటున్న కొందరు వ్యక్తులకు తాను అడ్డుగా ఉన్నానని భావిస్తున్నారని, అందుకే తనపై విమర్శలు చేయిస్తున్నారని పరోక్షంగా జగన్‌ని ఉద్దేశించి అన్నారు. బయ్యారం గనుల యజమానులు తనపై చేస్తున్న విమర్శలు కూడా ఇందులో భాగమేనని ఆయన తిరుపతిలో అన్నారు.

కడప జిల్లా రైల్వేకోడూరులో పర్యటనకు వెళ్తున్న ఆయన తిరుపతి విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి వచ్చేయాలన్న తాపత్రయం తనకు లేదని చిరంజీవి అన్నారు. ఆర్జిత సేవా టిక్కెట్ల కుంభకోణంపై దినేష్‌ రెడ్డి ఇచ్చిన నివేదికలో ఇంకా చాలా విషయాలు బయటకు రావాలని చెప్పారు. సినీ దంపతులు జీవిత, రాజశేఖర్‌ ల గురించి మాట్లాడడం మనపై మనం బురద జల్లుకోవడం లాంటిదని వ్యాఖ్యానించారు. చిరంజీవి బ్లడ్ బ్యాంక్ పై జీవిత, రాజశేఖర్ లు తీవ్రమైన ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+