వైయస్ జగన్ ఓదార్పు తీరుపై ప్రణబ్ ముఖర్జీ అసహనం

ఓదార్పు యాత్రను రాజకీయం చేయడంపై జగన్ ప్రణబ్ ముఖర్జీకి ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. అయితే, ప్రణబ్ ఓదార్పుపై జగన్ కు కొన్ని సూచనలు చేసినట్లు తెలుస్తోంది. వైయస్ మరణానికి షాక్ కు గురై మరణించినవారి కుటుంబాలను జిల్లా కేంద్రాలకు రప్పించి ఆర్థిక సహాయం అందించాలని, ఓదార్పు యాత్ర పేర హంగూ ఆర్భాటాలతో జిల్లాలంతటా పర్యటించాల్సిన అవసరం లేదని ప్రణబ్ సూచించినట్లు సమాచారం. అలాగే, ఓదార్పు యాత్రను పార్టీపరంగా చేపట్టాలని కూడా ఆయన సూచించినట్లు తెలుస్తోంది.
అయితే, ప్రణబ్ సూచనలను పాటించడానికి జగన్ విముఖత ప్రదర్సించారని, ఓదార్పు యాత్ర తన వ్యక్తిగతమని ఆయన చెప్పినట్లు తెలుస్తోంది. అలాగే, పావురాల గుట్ట వద్ద తన తండ్రికి ఇచ్చిన మాట ప్రకారం బాధితుల ఇళ్లకు వెళ్లాల్సిన అవసరం ఉందని జగన్ చెప్పినట్లు సమాచారం. జగన్ వాదన పట్ల ప్రణబ్ తీవ్ర అసహనం వ్యక్తం చేసినట్లు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications