మా బావ చిరంజీవి గురించి నేనే చెప్తా: అల్లు అరవింద్

ఆ తర్వాత కొద్ది రోజులకు ఓ పేపర్‌లో 'రక్తం అందక ఇద్దరి మృతి' శీర్షికతో వార్త వస్తే అది చూసి చిరంజీవి కదిలిపోయారని, తర్వాత వచ్చిన తన పుట్టిన రోజునాడు అభిమానులు రక్తదానం చేస్తే వచ్చే ఏడాది చిరంజీవి బ్లడ్ బ్యాం కులో చేద్దురు గాని సిద్ధంగా ఉండండన్నారని, అనుకున్నట్టుగానే బ్లడ్ బ్యాంక్ పెట్టి తనే తొలుత రక్తం దానం చేశారని, అదీ చిరంజీవి చిత్తశుద్ధి అని అరవింద్ వివరించారు. మూడున్నర ఏళ్ల కిందట 150వ చిత్రం గురించి చర్చించడానికి వెళ్లినప్పుడు తాను రాజకీయాల్లోకి ప్రవేశిస్తానని చెప్పారని, ముఖ్యమంత్రినో ప్రధానినో కావడానికి వెళ్లడం లేదనీ ప్రజలకు సేవ చేయడానికి వెళ్తున్నానీ చెప్పినట్లు ఆయన తెలిపారు.
"రాజకీయం యుద్ధంలాంటిది. విద్య నేర్చుకుని అందులోకి దిగాలి. ఏమీ నేర్చుకోకుండానే దిగేశాం. ఎన్నెన్నో ఎదురు దెబ్బలు తిన్నాం. మా ఆదరణను దెబ్బ తీయడానికి కోవర్టులను దించారు. కిరాయి మనుషులను పెట్టారు. ప్రజా చైత న్య యాత్రలకు జనం అశేషంగా వస్తున్నారని మా కోసం కొత్త ట్రాఫిక్ రూల్స్ తెచ్చారు. సర్వేలంటూ ప్రజల్లోకి తప్పుడు సంకేతాలు పంపారు. యుద్ధంలో ప్రాణాలు తీయాలి. లేదంటే ప్రాణాలు ఇవ్వాలి. ప్రజారాజ్యం పార్టీలో ఎవరికీ ప్రాణాలు తీయడం తెలియదు. అందుకే కార్యకర్తలంతా ప్రా ణా లు ఇవ్వడానికి సిద్ధంగా ఉండండి" అని అరవింద్ తన ప్రసంగాన్ని ముగించారు.












Click it and Unblock the Notifications