రాహుల్ గాంధీ మైనింగ్ పై ఎందుకు మాట్లాడరు: చంద్రబాబు నాయుడు

గనులు తవ్వి ఇష్టానుసారంగా ఎగుమతి చేస్తూ అక్రమంగా కోట్లు సంపాదిస్తున్నారని చంద్రబాబు అన్నారు. ఖనిజాల తవ్వకం పేరిట రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ తవ్వకాలపై ముఖ్యమంత్రి నామమాత్రంగా స్పదిస్తున్నారని విమర్శించారు. గనుల అక్రమ తవ్వకాలపై తాము ఐదేళ్లుగా పోరాటం చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌లో జిందాల్, రస్‌అల్‌ఖైమా ఒప్పందాలను ఎందుకు రద్దు చేయట్లేదని ఆయన అడిగారు. అక్రమంగా మైనింగ్ తో కొంత మంది ధనవంతులవుతున్నారని ఆయన అన్నారు. అక్రమ ఖనిజ తవ్వకాలను రద్దు చేయడంలో ప్రభుత్వం భేషిజాలకు పోవద్దని ఆయన సూచించారు.












Click it and Unblock the Notifications