చంద్రబాబు నాయుడు నోట తెలంగాణ విమోచన దినోత్సవం మాట

కాగా, తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించేలా ఆదేశించాలని కోరుతూ శుక్రవారం హైకోర్టులో ఓ పిటిషన్ దాఖలైంది. చంద్రశేఖర రెడ్డి అనే న్యాయవాది ప్రజా ప్రయోజనాల వ్యాజ్యం (పిల్) కింద ఆయన పిటిషన్ దాఖలు చేశారు. కర్నాటక, మహారాష్ట్ర తరహాలో తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించి, సెప్టెంబర్ 17ను సెలవు దినంగా ప్రకటించాలని ఆయన కోరారు. దేశానికి ఆగస్టు 15వ తేదీన స్వాతంత్ర్యం రాగా, హైదరాబాదు రాజ్యంలో భాగమైన తెలంగాణ మాత్రం నిజాం పాలనలోనే ఉంది. సెప్టెంబర్ 17వ తేదీన నిజాం యూనియన్ ప్రభుత్వానికి లొంగిపోవడంతో తెలంగాణ భారతదేశంలో భాగమైంది.












Click it and Unblock the Notifications