వైయస్ జగన్ పై చిరంజీవి ప్రజారాజ్యం ప్రత్యక్ష దాడి

సిమెంటు కంపెనీల్లో ప్రతిష్ఠాత్మకమైన దాల్మియా షేర్ రూ.240 ఉంటే ఇటీవలే పుట్టిన భారతీ సిమెంట్స్ షేరు రూ.1,400 ఉండడం ఆశ్చర్యకరమన్నారు. వైయస్ జగన్ కు చెందిన భారతీ సిమెంట్స్ షేర్లను దాల్మియా సిమెంట్స్ కొనుగోలు చేయడం వెనక భారీ అవినీతి దాగుందని ఆయన అన్నారు. వివిధ పారిశ్రామిక సంస్థలకు వైఎస్ ఏదో లబ్ధి చేకూర్చి అందుకు ప్రతిగా తన సంస్థల్లో పెట్టుబడులు పెట్టించారని, జగన్ కంపెనీల్లో పెట్టుబడి పెట్టిన పారిశ్రామిక సంస్థలన్నింటిపైనా సిబిఐతో దర్యాప్తు చేయిస్తే వాస్తవాలు వెలుగు చూస్తాయన్నారు.
భవిష్యత్తులో రాజ్యాధికారం బిసిలకు వస్తుందని, ఉత్తరప్రదేశ్, బీహార్ తరహాలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తారని రామచంద్రయ్య ఆశాభావం వ్యక్తంచేశారు. ప్రజారాజ్యం పార్టీకి లేనిది మీడియా బలమేనని అన్నారు.తాము బీసీలకు 104 సీట్లిచ్చినా భారీగా సీట్లిస్తామన్న ప్రధాన పార్టీలు తమ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేకపోయినా ఆ విషయానికి పత్రికల్లో స్థానం దక్కలేదన్నారు.












Click it and Unblock the Notifications