వైయస్ వివేకానంద రెడ్డికి జగన్ ఓదార్పుపై మంత్రి క్లాస్

వైయస్ వివేకానంద రెడ్డి సమాధానానికి ఆయన అసహనం వ్యక్తం చేసినట్లు సమాచారం. 'ఇప్పటికే మేం చెప్పాల్సిందంతా చెప్పాం. ఇంకా చెప్పేదేముంది?' అని వివేకానందను ఆయన ప్రశ్నించారని సమాచారం. వైఎస్ బంధువు వైవి సుబ్బారెడ్డితోనూ ఆ మంత్రి మాట్లాడినట్లు తెలిసింది. ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో ఓదార్పు యాత్ర ముగిసిన తర్వాత అధిష్ఠానం చెప్పినట్లే జగన్ నడుచుకుంటారని సుబ్బారెడ్డి ఆ మంత్రికి స్పష్టం చేసినట్ల్లు సమాచారం. ఇందుకు బదులిస్తూ ఆ మంత్రి - 'ఈ యాత్ర ముగిసే నాటికి పుణ్యకాలం పూర్తవుతుంది. అధిష్ఠానం తీసుకోవాల్సిన చర్యలూ తీసుకుంటుంది' అని నిష్ఠూరమాడినట్లు చెబుతున్నారు.
ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్రకు వైవి సుబ్బారెడ్డి ఏర్పాట్లు చేస్తున్న విషయం తెలిసిందే. ఆయనతో పాటు గనుల శాఖ మంత్రి బాలినేని శ్రీనివాస రెడ్డి కూడా ఏర్పాట్లలో చురుగ్గా పాల్గొంటున్నారు. వివేకానంద రెడ్డికి క్లాస్ తీసుకున్న మంత్రి ఎవరనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బహుశా, వ్యవసాయ శాఖ మంత్రి ఎన్. రఘువీరా రెడ్డి అయి వుండవచ్చునని అంటున్నారు. రఘువీరా రెడ్డికే వైయస్ కుటుంబ సభ్యులతో అలా మాట్లాడగలిగే సాన్నిహిత్యం ఉంది.












Click it and Unblock the Notifications