రాజీవ్ గాంధీని జగనేమైనా చంపారా: సబ్బం హరి

Rajiv Gandhi
న్యూఢిల్లీ: కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ వ్యవహారం కాంగ్రెసులో ముదిరి పాకాన పడుతోంది. జగన్ వర్గానికి చెందిన సీమాంధ్ర పార్లమెంటు సభ్యులకు, తెలంగాణ పార్లమెంటు సభ్యలకు మధ్య తీవ్ర వాగ్వివాదానికి దిగారు. పార్లమెంటు ఆవరణలోనే వారు శుక్రవారం బాహాబాహీకి దిగారు. తెలంగాణకు చెందిన పార్లమెంటు సభ్యుడు సర్వే సత్యనారాయణకు, జగన్ వర్గానికి చెందిన సీమాంధ్ర ఎంపి సబ్బం హరికి మధ్య తీవ్ర వాగ్వివాదం జరిగింది. రాజీవ్ గాంధీని జగనేమైనా చంపాడా అని సబ్బం హరి సర్వే సత్యనారాయణను ప్రశ్నించారు. రాజీవ్ గాంధీని చంపినవారినే సోనియా క్షమించారని సర్వే సత్యనారాయణ చేసిన వ్యాఖ్యపై సబ్బం హరి అగ్గి మీద గుగ్గిలమయ్యారు. రాజీవ్ గాంధీని జగనేమైనా చంపారా అని ఆయన ప్రశ్నించారు.

జగన్ ను చేసిన ఘోరమేమిటని సబ్బం హరి అన్నారు. జగన్ ను ఎందుకు టార్గెట్ చేసుకున్నారని ఆయన తెలంగాణ పార్లమెంటు సభ్యులను అడిగారు. సోనియా గాంధీ తరఫున వకాల్తా పుచ్చుకున్నారా అని అడిగారు. జగన్ గురించి మాట్లాడితే ఒక్కటిచ్చుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. దీంతో సర్వే సత్యనారాయణ తీవ్రంగా మండిపడ్డారు. బయ్యారంలో కోట్లు దండుకుంటున్నారని సర్వే ఆరోపించారు. దమ్ముంటే దానిపై విచారణ జరిపించాలని సబ్బం హరి సవాల్ చేశారు. వారి మధ్య గొడవను తగ్గించడానికి కాంగ్రెసు ఎంపిల ఫోరం కన్వీనర్ పొన్నం ప్రభాకర్ జోక్యం చేసుకున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+