వైయస్ జగన్ ఓదార్పుపై హైకమాండ్ దిగి వచ్చిందా?

అధిష్ఠానం నిర్ణయం తమ నేత ప్రభావమేననే ధోరణిని ప్రదర్శిస్తోంది. దీనికి ఓదార్పు యాత్రకు ఎలాంటి సంబంధం లేదని, దేనిదారి దానిదేననే ఆ శిబిరంలో కీలకనేతగా ఉన్న అంబటి రాంబాబు తెగేసి చెప్పారు. జగన్‌కు ఓదార్పు యాత్రలో జనం బ్రహ్మరథం పట్టబట్టే అధిష్ఠానం దిగి వచ్చిందనే రీతిలో జగన్ వర్గం నేతలు వ్యాఖ్యానిస్తున్నారు. ఢిల్లీ నిర్ణయంతో మరింత ఊపు లభిస్తుందని వారంటున్నారు. తన తండ్రి మరణాన్ని తట్టుకోలేక చనిపోయిన వారి కుటుంబాల గురించి పార్టీ పట్టించుకోలేదని జగన్ కాకినాడ సభలో చేసిన వ్యాఖ్యల నేపథ్యంలోనే అధిష్ఠానం ఈ నిర్ణయానికి వచ్చిందని వీరు చెప్పుకుంటున్నారు.












Click it and Unblock the Notifications