ఓదార్పుపై వైయస్ జగన్ మీద పెరుగుతున్న ఒత్తిడి

YS Jagan
హైదరాబాద్: ఓదార్పు యాత్ర విషయంలో కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ పై అన్ని వైపుల నుంచి ఒత్తిడి పెరుగుతోంది. ఓదార్పును పార్టీ తరఫున చేపట్టి వైయస్ మరణంతో షాక్ కు గురై మరణించినవారి కుటుంబాలకు ఆర్థిక సాయం అందించాలని కాంగ్రెసు అధిష్టానం నిర్ణయం తీసుకున్న నేపథ్యంలో ఆయనపై ఒత్తిడి పెరుగుతోంది. ఎఐసిసి నిర్ణయాన్ని జగన్ వర్గం తమ విజయంగా చెప్పుకుంటున్నప్పటికీ వైయస్ జగన్ వర్గం కూడా ఇరకాటంలో పడింది. ఇంత కాలం వైయస్ రాజశేఖర రెడ్డిని పార్టీ విస్మరిస్తోందని అంటూ ఓదార్పు యాత్రను సమర్థిస్తూ వచ్చిన ఆ వర్గం ఇప్పుడు ఏం చేయాలో తెలియని అయోమయంలో పడింది.

తిరుపతిలో వైయస్ సంస్మరణ సభ, ప్రకాశం జిల్లా ఓదార్పు యాత్ర విషయంలో ఏం చేయాలో పాలుపోని స్థితిలో పడింది. జగన్ ఓదార్పు యాత్ర కొనసాగుతుందని జగన్ వీర విధేయులు చెబుతున్నప్పటికీ కొంత మంది మాత్రం వెనక్కి తగ్గితేనే మంచిదనే అభిప్రాయం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత స్థితిలో జగన్ వర్గంలోనూ చీలిక వచ్చే ప్రమాదం ఏర్పడింది. పార్టీ అధిష్టానం మనసెరిగిన అనుభజ్ఞులు జగన్ వెనక్కి తగ్గితే మంచిదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. దానికి విరుగుడుగా జగన్ తో పార్టీ ఓదార్పు యాత్రను చేపట్టాలని అడుగుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+