ఓదార్పుపై వీరప్ప మొయిలీ ప్రకటన పూర్తి పాఠం

"దివంగత నేత, ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి పార్టీకి చేసిన సేవలను, రాష్ట్ర ప్రజల పట్ల ఆయనకున్న నిబద్ధతను ఏఐసీసీ గుర్తుచేసుకుంటోంది. ఆయన తొలి వర్థంతి సందర్భంగా పార్టీ నివాళులు అర్పిస్తోంది."
"డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డి మరణానంతరం ఆత్మహత్యలు చేసుకున్న వ్యక్తుల కుటుంబాలకు అవసరమైన సాయాన్ని అందించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు గతంలో ఏఐసీసీని ఆదేశించారు."
"బాధిత కుటుంబాలకు రూ.లక్ష చొప్పున సాయం అందించాలని కాంగ్రెస్ అధ్యక్షురాలు తర్వాత నిర్దేశించారు. సంబంధిత జిల్లా కమిటీల అధ్యక్షులు, ఎంపీలు ఆయా జిల్లాల్లో సమావేశమైన తర్వాత డబ్బుల పంపిణీ ఉంటుంది."












Click it and Unblock the Notifications