వైయస్ జగన్ ఓదార్పునకు మెజారిటీ ఎమ్మెల్యేలు దూరమే

నియోజకవర్గాల్లోని ద్వితీయ, తృతీయశ్రేణి నేతలతో మాట్లాడుతూ అన్నివిధాలా అండగా ఉంటామని బాలినేని శ్రీనివనాస రెడ్డి, వైవి సుబ్బారెడ్డి హామీలిస్తున్నారు. ఎమ్మెల్యేలు రాకున్నా యాత్ర దిగ్విజయంగా సాగించి సత్తా చాటుకోవాలనే పట్టుదలతో వ్యవహరిస్తున్నారు. రెండురోజులుగా పరస్పరం సంప్రదించుకుంటూ..యాత్రకు దూరంగా ఉండే విషయంలో కలిసికట్టుగా వ్యవహరించాలనుకుంటుని శాసనసభ్యులు అనుకుంటున్నారు. యర్రగొండపాలెం ఎమ్మెల్యే సురేష్‌ను యాత్రలో పాల్గొనాల్సిందిగా స్థానికంగా బలమైన వర్గం గట్టి ఒత్తిడి తెస్తోంది. దాంతో ఆయన ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒత్తిడికి ఆయన లొంగకుండా చూసేందుకు కొంతమంది సీనియర్ నేతలు ప్రయత్నిస్తున్నారు. మరోవైపు, తన లోక్‌సభ నియోజకవర్గం పరిధిలోకొచ్చే కందుకూరు అసెంబ్లీ స్థానంలోకి యాత్ర ప్రవేశించినప్పుడు తాను పాల్గొంటానని నెల్లూరు ఎంపీ మేకపాటి రాజమోహన్‌రెడ్డి ఇప్పటికే ప్రకటించారు.












Click it and Unblock the Notifications