తెలంగాణ ఎంపిలపై ఫైర్: ముదురుతున్న వివాదం

తెరాసతో తమ పార్టీ కాంగ్రెసు ఎంపిలు చేతులు కలిపారని ఆయన ఆరోపించారు. తద్వారా వారు పార్టీ క్రమశిక్షణను ఉల్లంఘించారని ఆయన విమర్శించారు. వారిపై చర్యలు తీసుకోవాలని తాము తమ పార్టీ అధ్యక్షురాలు సోనియాను కోరుతామని ఆయన చెప్పారు. రేపు సీమాంధ్ర ఎంపిలు సమావేశమై చర్చించి సోనియాను కలుస్తారని ఆయన చెప్పారు. తెరాసతో చేతులు కలపడం వల్లనే ఉప ఎన్నికల్లో తమ కాంగ్రెసు పార్టీ ఓడిపోయిందని ఆయన అన్నారు. తెలంగాణ ఎంపిలపై చర్య తీసుకోకపోతే పార్టీకి నష్టం వాటిల్లుతుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications