వైయస్సార్ విగ్రహ స్థాపనపై నెల్లూరులో రగడ

వైయస్ విగ్రహ ప్రతిష్టాపనపై జగన్ అనుకూల, వ్యతిరేక వర్గాల మధ్య తీవ్ర వివాదం చోటుచేసుకుంది. విగ్రహ ప్రతిష్టాపనకు ఆనం సోదరులు అడ్డు పడుతున్నారని కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కె. రోశయ్య మెప్పు కోసం రాజకీయ ప్రయోజనాల కోసం మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఆనం వివేకానంద రెడ్డి వైయస్సార్ విగ్రహ ప్రతిష్టాపనను అడ్డుకుంటున్నారని ఆయన అన్నారు. పార్లమెంటు సభ్యుడు మేకపాటి రాజమోహన్ రెడ్డి లేఖ రాసినా విగ్రహ ప్రతిష్టాపనకు అధికారులు అనుమతి ఇవ్వకపోవడాన్ని ఆయన తప్పు పట్టారు. తొలుత వైయస్ జగన్ కు అనుకూలంగా ఉన్న ఆనం సోదరులు అధిష్టానం వైఖరి స్పష్టం కావడంతో వ్యతిరేకంగా మారారు.












Click it and Unblock the Notifications