కాంగ్రెసు గొడవ: సీమాంధ్ర నేతలపై తెలంగాణ నేతల గుర్రు

సీమాంధ్ర నేతల వైఖరిని కాంగ్రెసు నల్లగొండ పార్లమెంటు సభ్యుడు గుత్తా సుఖేందర్ రెడ్డి తప్పు పట్టారు. తమ పార్టీ సీమాంధ్ర పార్లమెంటు సభ్యులు రాయపాటి సాంబశివరావు, లగడపాటి రాజగోపాల్ మాటలు సరైనవి కావని ఆయన సోమవారం నల్లగొండలో మీడియా ప్రతినిధులతో అన్నారు. పోలీసు పహరాలో గ్రూప్ వన్ పరీక్ష నిర్వహించడాన్ని ఆయన తప్పు పట్టారు. తెలంగాణ ప్రజలను రెచ్చగొట్టవద్దని ఆయన సీమాంధ్ర నేతలకు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు డిసెంబర్ 9వ తేదీన కేంద్ర హోం మంత్రి చిదంబరం ప్రకటనను అమలు చేయించుకోవడమే తమ ముందున్న కర్తవ్యమని ఆయన అన్నారు. తెలంగాణ రాష్ట్ర సాధనే తమ ప్రధాన లక్ష్యమని ఆయన చెప్పారు.












Click it and Unblock the Notifications