ఈనాడు, ఆంధ్రజ్యోతిలపై వైయస్ జగన్ గరం

YS Jagan
ఒంగోలు: తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నాయంటూ కాంగ్రెసు కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలపై మండిపడ్డారు. అయితే, ఆయన ఆ రెండు దినపత్రికల పేర్లు ప్రస్తావించకుండా విమర్శలు చేశారు. సోమవారం ప్రకాశం జిల్లా పామూరు ఓదార్పుయాత్ర సభలో ఆయన తనంటే గిట్టనివారు తనకు వ్యతిరేకంగా వార్తలు రాస్తున్నారని అన్నారు. తాను ఒంటరినని కొన్ని పత్రికలు వార్తలు రాస్తున్నాయని ఆయన అన్నారు. తనపై ఆ పత్రికలు దుష్ప్రచారం సాగిస్తున్నాయని విమర్శించారు. రోజూ రాసిందే రాస్తున్నారని ఆయన అన్నారు.

తన లక్షలాది మంది ప్రజలు ఉండగా ఒంటరివాడిని ఎలా అవుతానని ఆయన అడిగారు. ప్రజలు చిరునవ్వుతో తనకు స్వాగతం పలుకుతున్నారని ఆయన చెప్పారు. తనకు లభిస్తున్న ఆదరణ, ఆప్యాయత చూసి ఓర్వలేక వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని, వార్తాకథనాలు రాస్తున్నారని ఆయన అన్నారు. ప్రజల గుండెల్లో తన తండ్రి వైయస్ రాజశేఖర రెడ్డి గూడు కట్టుకుని ఉన్నారని ఆయన అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+