వైయస్ జగన్ రాజా ఆఫ్ కరప్షన్: బైరెడ్డి రాజశేఖర రెడ్డి

గతంలో నీలం సంజీవరెడ్డి, దామోదరం సంజీవయ్య, కాసు బ్రహ్మానందరెడ్డి, ఎన్టీఆర్, కోట్ల విజయభాస్కర్‌రెడ్డి ఇలా పలువురు సీఎంలుగా చేశారని, కానీ వీరంతా సొంతిల్లు అభివృద్ధి చేసుకోవాలన్నా ప్రజలు ఏమనుకుంటారో అని భయపడేవారిని, వైఎస్ మాత్రం నిస్సిగ్గుగా రాష్ట్రాన్ని దోచేశారన్నారు. వైఎస్‌ను అవినీతి చక్రవర్తిగా అభివర్ణించారు. వైఎస్‌కోసం ఏ ఒక్కరూ చనిపోలేదని, పులివెందులలో కూడా ఎవరూ చనిపోలేదని, కనీసం నిత్యం వైఎస్‌నే అంటిపెట్టుకు ఉండే తెల్లజుట్టు సూరీడు కూడా చనిపోలేదన్నారు. తమ కర్నూలు జిల్లాకు వస్తే ఆ జిల్లాలో ఎవరెవరు ఏయే కారణాలతో చనిపోయారో నిరూపిస్తానన్నారు. వైఎస్ రాజశేఖర్‌రెడ్డి అక్రమ సంపాదనపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications